జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్
నర్సాపూర్(ప్రజాజ్యోతి): రైతులు పంటకు యూరియా వాడకాన్ని తగ్గించాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ సూచించారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రంలో సరఫరా చేస్తున్న యూరియాను ఆయన పరిశీలించారు. మోతాదుకు మించి యూరియా వాడకం వల్ల చీడపీడలు పెరిగి రైతులకు ఎక్కువ ఖర్చు, తక్కువ దిగుబడి వస్తుందన్నారు. మండలానికి సరిపడా యూరియా సరఫరా చేయడం జరుగుతుందని స్పష్టంగా తెలిపారు. ఆయనతోపాటు సహాయ వ్యవసాయ సంచాలకు సంధ్యారాణి, సహాయ వ్యవసాయ సంచాకులు వినయ్ కుమార్, మండల వ్యవసాయ అధికారిని దీపిక, తదితర రైతులు ఉన్నారు.