గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
- తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి
దామెర, సెప్టెంబర్ 17 (ప్రజాజ్యోతి):
గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని దామెర తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి సూచించారు. బుధవారం ఒగ్లాపూర్ లోని ఎస్బిఐటి ప్రాంగణంలో కొనసాగుతున్న మైనారిటీ పాఠశాల, జ్యోతిరావు పూలే హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులకు వండిన భోజనాలను పరిశీలించారు. అనంతరం వైద్య పరీక్షలను పరిశీలించారు. విద్యార్థులకు సీజనల్ వ్యాధులు ప్రభలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ లను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ తో పాటు గీర్దావార్ సంపత్ రావు, ఒగ్లాపూర్ జిపివో హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.