మాచారెడ్డి సొసైటీని ముట్టడిస్తాం..!
— బిఆర్ఎస్ సీనియర్ నేత బుచ్చిరెడ్డి
రామారెడ్డి సెప్టెంబర్ 10 (ప్రజా జ్యోతి)
రైతుల ఆధ్వర్యంలో మాచారెడ్డి సొసైటీ ముట్టడిస్తాం మాచారెడ్డి మండలం నుండి రామారెడ్డి మండలంలో విలీనమైన ఏడు గ్రామపంచాయతీలకు యూరియా సరఫరా సరిగ్గా కావడం లేదు మాచారెడ్డి సొసైటీ చైర్మన్, మాచారెడ్డి సొసైటీ సిఇఓ గాని స్పందించడం లేదు ఈ గ్రామాల రైతులు మాచారెడ్డి సొసైటీ కి వెళితే యూరియా ఇవ్వడం లేదు రామారెడ్డి మండల కి వెళ్లాలని చెప్తున్నారు. అదే రామారెడ్డి సొసైటీ కి వెళితే మాచారెడ్డి సొసైటీ కి వెళ్లాలని చెప్తున్నారు..? ఈ రెండు సొసైటీల మధ్య ఏడు గ్రామాల రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. కావున ఇట్టి విషయంపై మాచారెడ్డి సొసైటీ చైర్మన్ సహకార సంఘం అధికారులు మరియు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి ఈ ఏడు గ్రామాలకు యూరియా సరఫరా ఆయే విధంగా చూడగలరని మనవి చేశారు. ఒకటి రెండు రోజులలో సరఫరా కాకపోతే బిఆర్ఎస్ పార్టీ తరపున, రైతుల ఆధ్వర్యంలో మాచారెడ్డి సొసైటీని ముట్టడిస్తాం ఇట్టి సమావేశం లో రామారెడ్డి మండల బిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ బుచ్చిరెడ్డి, యూత్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు రాజా గౌడ్, మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రామ్ రెడ్డి, పాల్గొనడం జరిగింది.
