నల్లబెల్లి / ప్రజాజ్యోతి:
కాంగ్రెస్ నాయకుల వేధింపులు భరించలేక తహసీల్దార్ కార్యాలయంలో ఓ జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయం లో వాంకుడోతు కల్పన విఆర్ఏ గా ఉద్యోగం సాధించి, పదోన్నతి పోంది జూనియర్ అసిస్టెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తుంది. గత కొంత కాలంగా.. మేడపల్లి మాజీ ఎంపిటిసి మాలోత్ చరణ్ సింగ్, మాలోత్ మోహన్ ఇద్దరు కల్పన ను వేధింపులకు గురి చేస్తున్నారు. కార్యాలయంలో ఓ పని చేయించాలని వేదిస్తున్నారు. ఆ పని చేయక పోవటంతో గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ కు తప్పుడు ఫిర్యాదు చేసి, అట్టి విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. భరించలేక సోమవారం ఆఫీస్ లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడింది. గమనించిన సిబ్బంది వెంటనే నర్సంపేట లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు ఆత్మహత్యకు పాల్పడిన జూనియర్ అసిస్టెంట్ కల్పన రాసిన సూసైడ్ నోట్ కుటుంబ సభ్యులకు దొరికింది. తనను లైగికంగా వేదిస్తున్నారని నోట్ లో పేర్కొంది.