సూర్యాపేట జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 05(ప్రజాజ్యోతి):గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొమ్మిది రోజులపాటు నిర్విఘ్నంగా పూజలు అందుకున్న వినాయకుని నిమజ్జనం వేడుకలను శుక్రవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.విద్యానగర్ లోని మధు ట్రావెల్స్ సమీపంలో మధు ట్రావెల్స్ ఓనర్స్ కమ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల 8వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.గణేష్ నిమజ్జనం సందర్భంగా మధు ట్రావెల్స్ చల్లా మధు శాంతిప్రియ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగల వల్ల భక్తి భావం పెంపొందుతుందని అన్నారు.ఆదిదేవుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి మంచి జరగాలని ఆకాంక్షించారు. అంతకుముందు నిర్వహించిన స్వామి వారి లడ్డు వేలం పాటలో ధరావత్ శివ రూ.21116కు స్వామి వారి లడ్డూను దక్కించుకున్నారు.