గ్రామపంచాయతీ ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

V. Sai Krishna Reddy
2 Min Read

గ్రామపంచాయతీ ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

అంతా గప్చుప్

సీన్ వెలుగులోకి రాకుండా చక్రం తిప్పిన మైనార్టీ వ్యక్తి

మఖ్తల్ నియోజకవర్గ ప్రతినిధి, సెప్టెంబర్ 05 (ప్రజా జ్యోతి): అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామపంచాయతీ ట్రాక్టర్ లో దొంగతనంగా విద్యుత్ స్తంభాన్ని తరలిస్తున్నంగా ట్రాక్టర్ ఢీకొని అంబన్న ( 70)వ్యక్తి మృతి చెందిన సోమవారం జరిగిన .సంఘటనను బయటకు పొక్కకుండా లింగంపల్లి గ్రామానికి చెందిన ఓ మైనార్టీ వ్యక్తి అందరిని గప్ చుప్ చేసి చక్రం తిప్పుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తేదీ 1 సోమవారం నాడు
నారాయణపేట జిల్లా మఖ్తల్ మండలం లింగంపల్లి గ్రామ సమీపంలో గల 33/11 కెవి సబ్ స్టేషన్ నుండి లింగంపల్లి గ్రామానికి చెందిన మైనార్టీ వ్యక్తి ఎలాంటి పర్మిషన్ లేకుండా గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను డ్రైవర్ తో కాకుండా సఫాయి పనిచేసే వ్యక్తితో ట్రాక్టర్లు తీసుకువెళ్లి అక్రమంగా విద్యుత్ స్తంభాన్ని ట్రాక్టర్లో తీసుకువస్తుండగా రోజువారీగా మఖ్తల్ పట్టణంలో పనులు ముగించుకొని స్వగ్రామమైన ఊట్కూర్ మండలం చిన్నపోర్ల గ్రామానికి వెళ్తుండగా ఆంబన్న (70) అనే వ్యక్తిని ఢీకొని మృతి మృతి చెందగా ఎంత సోమవారం ఏడు గంటల ప్రాంతంలో జరగక ఇట్టి విషయాన్ని బయటకు పొక్కకుండా గ్రామానికి చెందిన ఓ మైనార్టీ వ్యక్తి తనతో పాటు ఉన్న వ్యక్తులు ఎవరికీ చెప్పకుండా గప్చుప్ చేసి చక్రం తిప్పగా ఎలా ప్రమాదం జరిగిందో తెలియని మృతుడు అంబన్న కుటుంబ సభ్యులు శవాన్ని మంగళవారం గ్రామాల్లో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే జరిగిన విషయం ఆలస్యంగా మృతుడు కుటుంబ సభ్యులకు శుక్రవారం లింగంపల్లి గ్రామపంచాయతీ ముందు బాధిత కుటుంబ సభ్యులు గ్రామ పంచాయతీ సెక్రెటరీని కార్యాలయంలో అడ్డుకొని ఇంత జరిగిన తెలిసి కూడా మౌనంగా ఎన్నుకున్నారు చెప్పాలని తమకు న్యాయం చేయాలని నిలదీశారు. అయితే తనకు తెలియకుండా జరిగిన విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాదానికి కారణమైన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని గ్రామస్తుల ముందు వీఆర్ఏ తెలపడంతో వీఆర్ఏ ను విడిపించి పెట్టారు. మృతుడి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం: – మఖ్తల్ మండలం లింగంపల్లి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ను పంచాయతీ సెక్రెటరీ పర్మిషన్ లేకుండా దౌర్జన్యంగా సాయంత్రం సమయంలో ఓ మైనార్టీ నాయకుడు సఫాయి పనిచేసే వ్యక్తితో ట్రాక్టర్ ను తీసుకువెళ్లి సబ్ స్టేషన్ నుండి కరెంటు స్తంభాన్ని ట్రాక్టర్లో రోడ్డుపైకి తీసుకువస్తుండగా మఖ్తల్ నుండి అంబన్న అనే వ్యక్తి బైక్ పై స్వగ్రామానికి వెళ్తున్నంగా ట్రాక్టర్ ను ఢీకొని తీవ్రంగా గాయపడి చనిపోవడం జరిగింది. జరిగిన విషయాన్ని పంచాయతీ సెక్రటరీకి , పోలీసులకు చెప్పకుండా తనతో పాటు ఉన్న మరికొందరికి అంతా నేను చూసుకుంటానని చెప్పి విషయాన్ని బయటకు పోక్కకుండా లింగంపల్లి గ్రామానికి చెందిన మైనార్టీ వ్యక్తి చక్రం తిప్పాడు. శుక్రవారం అసలు విషయం బయటకు రావడంతో లింగంపల్లి గ్రామస్తులు ఒకసారిగా ఆశ్చర్యపోయారు. బాధిత కుటుంబ సభ్యులు లింగంపల్లి గ్రామస్తులతో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న కూడా దీనికంతటికి కారణమైన మైనార్టీ నాయకుడు మాత్రం రాకపోవడం విచిత్రంగా గ్రామస్తులు విచిత్రంగా చూస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *