మెదక్ :బిఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నందుకు కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేసిన కవిత, గత కొంత కాలంగా బీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శులు సోమా భరత్ కుమార్, టి. రవీందర్ రావు పేర్ల మీద ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలోనే పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.