సూర్యాపేట జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 01(ప్రజాజ్యోతి):సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 30వ వార్డులో గల కొత్త బస్టాండ్ దగ్గర నుంచి హైటెక్ బస్టాండ్ వెనుక భాగము జాతీయ రహదారికి సమీపంలో ఉన్నందున అంతర్రాష్ట్ర దొంగలు,చైన్ స్నాచింగ్ లు దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండంతో కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో సోమవారం కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతూ బిజెపి 30 వార్డు మాజీ కౌన్సిలర్ పల్స మహాలక్ష్మి మల్సూర్ ఆధ్వర్యంలోవినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఎంపీ ల్యాడ్స్ నిధుల మునిసిపాలిటీలోని శ్రీ శ్రీ నగర్-వార్డ్ లో కెమెరాల ఏర్పాటు కొరకు అంచనా 3.00 లక్షలు.ఎస్సీ ఎక్స్ ఏజెన్సీ పేరు మీద ఎంపీడీవో సూర్యాపేట పేరు మీద మంజూరు చేయబడ్డాయని తెలిపారు.తక్షణమే సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వార్డు ప్రజల ఇబ్బందుల దృష్ట్యా సత్వరమే సి సి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు.