పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
— మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి
రామారెడ్డి ఆగస్టు 30 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలో కుండపోతగా కురిసిన భారీ వర్షాలకు రైతుల పంటలు పలు కొట్టుకుపోవడం జరిగింది. అదేవిధంగా వరి పొలాలలో ఇసుక కుప్పలు లతో మునిగిపోయాయి.పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి అన్నారు. మండలంలోని రామారెడ్డి, ఇసనపల్లి, గొల్లపల్లి, పోసానిపేట తో పాటు వివిధ గ్రామాల్లో నష్టపోయిన పంటలను రైతులతో కలిసి పర్యవేక్షించారు. మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి మాట్లాడుతు మండలంలోని పలు గ్రామాలలో చెరువులు, కుంటలు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో భారీ వరద వృద్ధికి వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయని అదేవిధంగా నీటికి కోతకు గురై రైతులు కన్నీరు అవుతున్నారు. సంబంధిత అధికార యంత్రాంగం తక్షణమే ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.