సహాయక చర్యల్లో పోలీస్ ల సేవలు భేష్..!
— స్థానిక ఎస్సై లావణ్య
రామారెడి ఆగస్టు 28 (ప్రజా జ్యోతి)
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు కుంటలు వాగులు వంకలు నిండి పొంగిపొర్లుతున్న తరుణంలో రోడ్లు కాల్వాట్లు తెగిపోయిన సందర్భంగా ప్రజలకు ప్రయాణికులకు రాకపోకలకు ఇబ్బందులు జరిగాయి. ముందస్తు చర్యలో భాగంగా ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం కాకుండా పోలీస్ సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టి భారీకేడ్లను ఏర్పాటు చేసి రామారెడ్డి మండల కేంద్రంలో ప్రమాద సూచికల వద్ద పోలీస్ పహారా కట్టుదిట్టం చేశారు. రాకపోకలకు కొద్దిగా ఇబ్బంది కలిగిన ప్రజా శ్రేయస్సు కొరకు చర్యలు తీసుకోక తప్పలేదు, రెస్క్యూటీం సహాయంతో వాగులో కొట్టుకపోయిన వ్యక్తిని కొన్ని గంటలపాటు కష్టపడి కాపాడడం జరిగింది. అదేవిధంగా శుక్రవారం ఎక్సెల్ పై వస్తున్న వ్యక్తి భారీ ప్రవాహానికి కొట్టుకుపోతున్న తరుణంలో పోలీస్ సిబ్బంది కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. స్థానిక ఎస్సై లావణ్య మాట్లాడుతూ ప్రజాలు ప్రయాణించే మార్గంలో లోతట్టు ప్రాంతాల ను గమనించి ప్రయాణించాలని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని ప్రజలకు సూచించారు.