*కల్యాణ లక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ నిరుపేదల పాలిట వరం*
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
చేవెళ్ల ప్రజా జ్యోతి
కల్యాణ లక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ నిరుపేదల పాలిట వరమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయలో చేవెళ్ల మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన *Rs.11,01,276/- (రూపాయలు పదకొండు లక్షల ఒక వెయ్యి రెండువందల డెబ్భైఆరు) విలువ గల *11 కళ్యాణ లక్ష్మీ / షాదీ ముబారక్* చెక్కులను అందజేశారు.
అనంతరం చేవెళ్ల, మొయినాబాద్, శంకర్ పల్లి మరియు షాబాద్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన మొత్తం *Rs.28,89,500/- (రూపాయలు ఇరవై ఎనిమిదిలక్షల ఎనబై తొమ్మిదివేల ఐదువందలు)* విలువ గల 66 సీఎం సహాయ నిధ చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం సహాయనిధి పేదల వరమని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీ
ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.