ట్రైబల్ బజార్ వసుళ్ళల్లో నిర్లక్ష్యం చేతివాటం
మున్సిపల్ ఆదాయానికి గండి
మఖ్తల్ నియోజకవర్గ ప్రతినిధి, ఆగస్టు 29 (ప్రజా జ్యోతి): మున్సిపాలిటీకి లక్షల్లో ఆదాయం వచ్చే తైబజార్ వసుళ్ళలో సిబ్బంది నిర్లక్ష్యం చేతివాటంతో నెలకు లక్షల్లో వాడి ఆదే కోల్పోతుందని అందులో పని చేసే కొంతమంది సిబ్బంది అంటున్నారు.
ఇటీవల మున్సిపాలిటీకి కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ఈ విషయంపై దృష్టి సారిచాల్సి ఉంది . అయితే ఇటీవల తైబజారు కోసం వేలం పాటలో పాల్గొనిక వ్యక్తి 14 లక్షలకు టెండర్ పాడి కైవసం చేసుకుని 3 లక్షల రూపాయలు చెల్లించడాడని సమాచారం తర్వాత కిస్తు చెల్లించేందుకు గడువు వాయిదా కోరి ఐదు నెల్ల వరకు తై బజారు వసూలు చేసుకుని బిచాణం ఎత్తేసాడు.
అప్పటినుండి సిబ్బందితో తై బజార్ ను సిబ్బందితో వసూలు చేస్తుండగా ఏదో మొక్కుబడిగా వసూలు చేస్తూ వసూలు చేసిన దానిలో ఎంత మొత్తం ఖజానా జమ చేస్తున్నారొ తెలియకుండా పోయింది.
దీనితో తై బజార్ నుండి నెలకు దాదాపు లక్షన్నర నుండి రెండు లక్షల వరకు వసూలు కాగా మూడు నెలలుగా పై బజార్ సిబ్బంది వసూలు చేస్తున్నారు. సామాన్య రోజుల్లో కూరగాయల గంప కు 20 నుండి 30 రూపాయలు.తొ బండ్లపై 50 రూపాయలు ఇతర ప్రాంతాల నుండి వస్తువులను తీసుకొచ్చే బొలెరో లారీలకు రెండు వందల నుండి 500 వరకు వసూలు చేస్తున్నారు, ప్రధానంగా మక్తల్ పట్టణానికి చుట్టు పక్కల గ్రామాల నుండి రోజువారీగా కూరగాయలను గంపల్లో తీసుకవచ్చి అమ్ముకుంటారు వారి నుండి 20 నుండి 40 రూపాయల వరకు వసూలు చేస్తారు. తోపుడుబండ్లకు మరో రేటు రోడ్డుపక్కల వ్యాపారం చేసుకునే వారికి మరో రేటుతొ. పై బజారు వసూల్ అయ్యది ఆదివారం రోజు బజాజ్( సంత) డే రొజు సామాన్య రొజుకన్న నాలుగైదు వేల వరకు వసూలు కాగా గతంలో దైబజార్ నిర్వహించిన వారు చెప్తు న్నారు.
గత మూడు నాలుగు నెలల నుండి తై బజారు వసూల్ చేసేవాడు లేకపోవడంతో మున్సిపల్ సిబ్బంది వసూళ్లుచేస్తున్న వారు ఆడిందె ఆట పాడిందే పాటగా మారింది.అయితే లెక్క ప్రకారం తై బజార్ నుంచి మున్సిపాలిటీకి లక్షల్లో ఆదాయం గండిపడుతున్నదని కార్యాలయం సిబ్బంది అంటు న్నారు. కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన మున్సిపా లిటీ కమిషనర్ మేల్కొని తై బజార్ టెండర్ను నిర్వహించి పక్కదారి పడుతున్న గదును ఖజానాకు మళ్ళించే లా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.