అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు చిన్నారుల మృతి

V. Sai Krishna Reddy
1 Min Read

మిన్నెసోటా మినియాపొలిస్‌లో ఓ క్యాథలిక్ పాఠశాలలో ఘటన
విద్యార్థులు ప్రార్థన చేస్తున్న సమయంలో కాల్పులు
ఘటనపై దిగ్భాంతి వ్యక్తం చేసిన మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. పాఠశాలలో విద్యార్థులు ప్రార్థన చేస్తున్న సమయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరో 17 మంది గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. మిన్నెసోటాలోని మినియాపొలిస్‌లో ఓ క్యాథలిక్ పాఠశాలలో విద్యార్థులు ప్రార్థన చేస్తున్న సమయంలో పలు ఆయుధాలతో అక్కడికి వచ్చిన నిందితుడు కిటికీల ద్వారా పిల్లలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 14 మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనపై మినియాపొలిస్ పోలీస్ చీఫ్ బ్రియాన్ ఓహారా మాట్లాడుతూ ఆయుధాలతో వచ్చిన నిందితుడు పిల్లలపై కాల్పులకు తెగబడ్డాడని చెప్పారు. ఈ ఘటనలో నిందితుడు కూడా మరణించాడని, అతని వయసు 20 ఏళ్ల లోపు ఉంటుందని తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *