భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండండి
— జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి
రామారెడ్డి ఆగస్టు 27 (ప్రజా జ్యోతి)
జిల్లాలో రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి, కుంటలు తెగిపోవడంతో, రైల్వే ట్రాక్లు, రోడ్లు వరద ప్రభావానికి కొట్టుకుపోతున్నాయి. ప్రజలు అవసరమైతే గాని బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. విద్యుత్ స్తంభాలను, విద్యుత్ ఇనుప పరికరాలను తాగకుండా జాగ్రత్తగా ఉండాలి. పురాతనమైన ఇండ్లు, శిథిలవస్తులో ఉన్న ఇండ్లలో ప్రజలు నివసించవద్దు, ప్రమాదంగా ఉంటే అధికారులకు సమాచారం అందిస్తే సురక్షిత ప్రాంతానికి తరలిస్తారు. ఎలాంటి ప్రమాదం, ఆపదలు పొంచి ఉన్న వెంటనే సమాచారం అందించండి. సెల్ఫీల కోసం సాహసాలు చేయవద్దని ప్రజలకు సూచనలు చేశారు.
