సూర్యాపేట టౌన్,ఆగస్టు 26(ప్రజాజ్యోతి):మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం హెచ్చరించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణంలోని పలు ప్రాంతంలో వాహనాల తనిఖీలు చేపట్టారు.ఇందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ ఎనిమిది మంది (08) పట్టుబడినట్లు ఎస్సై సాయిరాం తెలిపారు.పట్టుబడిన వారిని ఈరోజు 26-08-2025 నాడు కోర్టులో హాజరు పరచగా సూర్యాపేట ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి బి.వి.రమణ ఇద్దరికి ఒక్క రోజు జైలు శిక్ష మరియు రూ.2,000/- జరిమానా,అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన మిగతా ఆరుగురికి (06) కలిపి రూ.11,000/- జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పినట్లు ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపారు.