సదాశివనగర్ ఆగస్టు 25 (ప్రజాజ్యోతి)
రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు కమిషన్ వెంటనే విడుదల చేయాలని మండలంలోని రేషన్ డీలర్లు సదాశివనగర్ తాసిల్దార్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు గత ఐదు నెలల నుండి డీలర్లకు కమిషన్ రానందున తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వం ఐదు నెలలుగా రేషన్ డీలర్లకు కమిషన్ విడుదల చేయలేదు. ఈనెల కమిషన్ ఆ నెల జమ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కుంటూ అప్పలపాలయ్యమని వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్లు ఇచ్చే కమిషన్ను వేరు వేరు కాకుండా పాత పద్ధతిలో కమిషన్ ఒకేసారి విడుదల చేయాలని కోరారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రేషన్ డీలర్లకు కమిషన్ వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల మండల అధ్యక్షులు మొయినుద్దీన్, సెక్రటరీ రాజలింగం, వివిధ గ్రామాల రేషన్ డీలర్లు పాల్గొన్నారు.
