ఇంకుడు గుంతల నిర్మాణానికి భూమి పూజ
ముఖ్యఅతిథి తహసీల్దార్ రేణుక చౌహన్
గాంధారి ఆగష్టు 22(ప్రజాజ్యోతి)
గాంధారి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శుక్రవారం పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణంకు భూమి పూజ నిర్వహించారు. వర్షపు నీటిని భూమిలో ఇనికించే ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, గాంధారి తాజీ మాజీ సర్పంచ్ సంజీవ్ యాదవ్ స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ రేణుక చౌహన్ హాజరయ్యారు.ఈ కార్యక్రమం లో పంచాయితీ కార్యదర్శి నాగరాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సంగని బాబా, బొమ్మని బాలయ్య, ఎల్లారెడ్డి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సర్దార్ నాయక్, లైని రమేష్, గంగి రామకృష్ణ, సయ్యద్ అహమ్మద్, గడ శంకర్‌తో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.