ఎల్ ఏచ్ పి యస్ రాష్ట్ర కమిటీలో కామారెడ్డి జిల్లా నుండి ఇద్దరికి చోటు
ప్రజా జ్యోతి జుక్కల్ ప్రతినిది ఆగస్ట్ 22
పెద్ద కొడప్గల్ మండలం విఠల్ వాడి తాండాకు చెందిన జాదవ్ శ్రావణ్,రాష్ట్ర కార్యదర్శిగా జుక్కల్ మండలం దోస్పల్లికి చెందిన జాదవ్ లక్ష్మణ్ ను ఏలంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీలో కగ్రీవంగ ఎన్నుకున్నారు. హైదరాబాద్ లో జాతీయ అధ్యక్షులు, ట్రై కార్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు రాంబాల్ నాయక్ తమకు నియామక పత్రం అందజే శారాని తెలిపారు. అనంతరము వారు మాట్లాడుతూ….తమపై విశ్వాసం ఉంచి లంబాడా హక్కుల సాధన కోసం, వారి ఆర్థిక అభివృద్ధి కోసం, వారి సమస్యల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథోడ్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గణేష్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి భద్రి నాయక్, జిల్లా గౌరవ అధ్యక్షులు రూప్ సింగ్ నాయక్, రమేష్ నాయక్ పాల్గొన్నారు.