సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
* సీఐ రాజారెడ్డి
ఎల్లారెడ్డి ఆగస్టు 22 (ప్రజా జ్యోతి }
విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి అన్నారు శుక్రవారం ఎల్లారెడ్డి ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన షీటీమ్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతలపై విద్యార్థులకు నిర్వహించిన సురక్ష పోలీస్ కళా ప్రదర్శన సామాజిక అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎవరైనా ఫోన్‌లో ఓటీపీలు అడిగితే చెప్పరాదన్నారు. ఆన్‌లైన్‌లో తక్కువ ధరల పేరిట మోసం జరుగుతోందన్నారు. విద్యార్థులు అపరచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కొత్త వ్యక్తులు నమ్మరాదన్నారు. సైబర్ మోసాలకు గురైతే 1930 నెంబర్‌కు లేదా 100కు సమాచారం ఇవ్వాలన్నారు. ఎవరైన బడి మానేసి, బాలకార్మికులుగా పని చేస్తే పోలీసులకు తెలియజేయాలన్నారు. సైబర్ నేరాలు, సెల్‌ఫోన్ అతివినియోగం, రోడ్డు భద్రత నియమాలు, సమయపాలన, మహిళా వేధింపులు, చదువుపై శ్రద్ధ అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఎస్సై మహేష్ మాట్లాడుతూ యువత చెడు వ్యాసాలను చెడు అలవాట్లకు లోనే వారి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారన్నారు తో ద్వారా దేశం యువశక్తిని కోల్పోతుందని ఇలాంటి పరిమాణాలు అభివృద్ధిని సామాజిక పద్ధతులను దిబ్బతీస్తాయన్నారు. ప్రతి ఒక విద్యార్థి యువత సామాజిక బాధ్యతపై అవగాహన కలిగి ఉండాలని సమాజంలో మంచి చెడు పట్ల స్పృహ ఉండాలని ప్రమాదాలను గుర్తించాలని కోరారు. ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం వల్ల వారి కుటుంబం విధి పాలవుతుందని రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని మరి ముఖ్యంగా యువత ఆ జాగ్రత్తగా వాహనాలు నడపద్దని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం కానిస్టేబుల్ రామచంద్ర, తిరుపతి, శేషారావు,ప్రభాకర్, సాయిలు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ చంద్రకాంత్, అధ్యాపకులు శంకరయ్య విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.