మిర్యాలగూడలో మొదలైన మార్వాడి హటావో…నినాదం …!
మార్వాడీలకు వ్యతిరేకంగా పలు వర్తక దుకాణాలు బంద్
మిర్యాలగూడ, ఆగస్టు 22,( ప్రజాజ్యోతి):మార్వాడీలకు వ్యతిరేకంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పలు వర్తక దుకాణాలు బంద్ నిర్వహించారు. నాసిరకం వస్తువులు అమ్ముతూ స్థానిక ప్రజలను మోసం చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు.ఈ బందులో ఎలక్ట్రికల్, శానిటరీ,మొబైల్ ,పెయింటింగ్ షాప్ యజమానులు స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నారు.తెలంగాణ బచావో..మార్వాడి హటావో అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వర్తక సంఘం అధ్యక్షుడు హరి ప్రసాద్ మాట్లాడుతూ.. గుజరాత్,రాజస్తాన్ రాష్ట్రాలకు చెందిన మార్వాడీలు తెలంగాణకు వలస వచ్చి…ఇక్కడి నాసి రకం వస్తువులు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ప్రభుత్వానికి జిఎస్టి ఎగవేస్తూ.. తక్కువ ధరలకే వస్తువులను విక్రయిస్తూ తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు అన్నారు. ఎన్నో ఏళ్లగా వ్యాపారంతో జీవనం సాగిస్తూ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న తమకు వలస వ్యాపారుల వలన తీవ్ర అన్యాయంజరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన వ్యాపారాలు లేక.. పనులు లేక అవస్థలు పడుతున్నామన్నారు.