వై టి పి ఎస్ వద్ద భూ నిర్వాసితుల సంబరాలు
335 ఉద్యోగాలు కల్పించినందుకు బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ
సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు స్థానిక ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం
దామరచర్ల, ఆగస్టు 21,(ప్రజా జ్యోతి):దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిన సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తూ సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,మంత్రులు,ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ల చిత్రపటానికి పవర్ ప్లాంట్ ఎదుట పాలాభిషేకం చేశారు.అనంతరం బాణసంచా కాల్చి..స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పవర్ ప్రాజెక్టు కోసం భూములను ఇచ్చి సర్వం కోల్పోయిన 335 మంది భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వంఆదుకుందన్నారు.తమకు ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వం ఉద్యోగాలుకల్పించలేదన్నారు.ఆ హామీని నెరవేర్చేల అహర్నిశలు కృషిచేసిన స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.