మాచారెడ్డి ఆగస్టు 20.(ప్రజా జ్యోతి)
మాచారెడ్డి మండల కేంద్రం
అక్కపూర్ గ్రామానికి చెందిన 70 కుటుంబాలు ఈనెల 22వ తేదీన మాచారెడ్డి మండల అటవీశాఖ కార్యాలయం ముట్టడి చేస్తామన్న రైతులు. అక్కపూర్ గ్రామానికి చెందిన సర్వేనెంబర్ 22/1A లో గల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, తాత్కాలికంగా పంట పండించుకోవడానికి హక్కు పత్రాలు ఇవ్వాలని గ్రామానికి చెందిన రైతులు గడ్డం మధు, సంతోష్ కుమార్, చిన్న చంద్రం, రాజేందర్, దుర్గయ్య, నర్సవ్వ, బాల్ నర్సు, లక్ష్మీ, గంగమని ,ఎల్లయ్య అన్నారు, మా తాత ముత్తాతాల నుండి ఇదే సర్వే నెంబర్లో పంటలు పండించుకొని బతుకుతున్నామని, గత సంవత్సరం నుండి మండల ఫారెస్ట్ డిప్యూటీ ఆఫీసర్ రమేష్, బీట్ ఆఫీసర్లు మహేశ్వరి ,స్వప్న, చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పోడు భూములకు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పట్టాలు ఇవ్వాలని చెప్పినప్పటికీ ఇవ్వడం లేదని కావాలని మమ్ములను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని దయచేసి జిల్లా కలెక్టర్ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి చొరవ తీసుకొని మా భూములకు పట్టా పాసుబుక్ పత్రాలు ఇవ్వాలని వేడుకున్నారు, కావాలని మండల ఫారెస్ట్ డిప్యూటీ ఆఫీసర్ రమేష్, బీట్ ఆఫీసర్స్ మహేశ్వరి, సప్న చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, ఇప్పటికైనా అధికారులు మాకు న్యాయం చేయగలరని వేడుకున్నారు. లేకపోతే ఈనెల 22 తేదీన మండల ఫారెస్ట్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని డిమాండ్ చేశారు.