గాంధారి ఆగష్టు 20(ప్రజాజ్యోతి)
గాంధారి మండల కేంద్రం లో బుధవారం నేరల్ తాండ గ్రామానికి చెందిన బస్సి ప్రకాష్ నాయక్ నూతన గృహ ప్రవేశం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర లాబాన అధ్యక్షుడు బస్సి తాన్ సింగ్ నాయక్
జిల్లా నాయకులతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్బంగా నిర్వహించిన సత్యనారాయణ స్వామి పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు.ఈ కార్యక్రమానికి జిల్లా లాబాన అధ్యక్షుడు బంతి లాల్, ఆమర్ సింగ్ నాయక్, రతిరాం నాయక్, జగదీష్ నాయక్, మంజ దౌలత్ రామ్, మండల లాబాన యూత్ అధ్యక్షుడు బస్సి నర్సింగ్, రాము, గోపాల్, సంతోష్, హస్రాజ్, లగ్జిరాం, సాతల్యి తదితరులు హాజరయ్యారు.
