కర్ణాటకలోని గుండ్లుపేట తాలూకా బన్నితాళపురంలో ఘటన
స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల ఆర్య
బాలుడికి పుట్టుకతోనే హృద్రోగ సమస్య
సోమవారం అస్వస్థతకు గురైన ఆర్యను ఆసుపత్రిలో చేర్పించిన పేరెంట్స్
అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందిన బాలుడు
కర్ణాటకలో ఒకటో తరగతి చదువుతున్న బాలుడు గుండెపోటుతో చనిపోయిన విషాద ఘటన చోటు చేసుకుంది. గుండ్లుపేట తాలూకా బన్నితాళపురంలోని ఓ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల ఆర్య అనే బాలుడికి పుట్టుకతోనే హృద్రోగ సమస్య ఉంది.
సోమవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు బాలుడిని గుండ్లుపేట ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం చామరాజగనర జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, చికిత్స పొందుతూ ఆర్య నిన్న ఉదయం చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.