నాగిరెడ్డిపేట్,ఆగష్టు18(ప్రజాజ్యోతి):
శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో మహిమాన్విత శైవ క్షేత్రమైన తాండూర్ త్రిలింగ రామేశ్వర దేవాలయంలో భక్తులకు పోటెత్తారు .ఈ సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు,పూజలు చేయడం జరిగింది.పరిసర ప్రాంతాల నుంచి కాకుండా కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మహారాష్ట్ర కర్ణాటక తదితర ప్రదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరై తమ తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. లింగాష్టక పారాయణం, భజన తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
