పలు అభివృద్ధి పనులలో పాల్గొన్న ఎమ్మెల్యే
— ఎమ్మెల్యే మదన్మోహన్ రావు
రామారెడ్డి ఆగస్టు 16 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండలం కన్నాపూర్ తండా శ్రీ జగజంబ శ్రీ సేవాలాల్ మహారాజ్ టెంపుల్ లో దర్శించుకున్న ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్మోహన్ రావ్, కన్నాపూర్ తాండ కాంగ్రెస్ నాయకులు టెంపుల్ లో శాలువా తో సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు చేపడుతున్న లబ్ధిదారుల స్థితిగతులను తెలుసుకున్నారు. అదేవిధంగా తండాలో మూడు ఇండ్లు ఫారెస్ట్ అధికారులు ఆపడంతో అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే ఎఫ్డిఓ రామకృష్ణ తో మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరిగింది. లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. మరియు గత కొన్ని నెలల ముందు కాంగ్రెస్ కార్యకర్త కాట్రోత్ నర్సింగ్ యాక్సిడెంట్ అవడంతో అతని ఇంటికి వెళ్లి పరామర్శించి బ్యాటరీ త్రీ వీలర్ ను, గూగులొత్ రమేష్ తండ్రి కొమర్యి ఇద్దరికీ ఇస్తానని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ గోవింద్ నాయక్, మాజీ ఉపసర్పంచ్ సర్మన్ నాయక్, గ్రామ అధ్యక్షులు శంకర్ నాయక్,శ్రీనివాస్ లచ్చిరాం, రెడ్యా, రవి తేజ, గోవింద్, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.
