హైదరాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తున్న పలువురు బంగ్లాదేశీయులను తెలంగాణ పోలీసులు సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్ఎఫ్) అప్పగించారు. ఈ విషయాన్ని తెలంగాణ పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. సుమారు 20 మంది బంగ్లాదేశీయులను దేశ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగించినట్లు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
హైదరాబాద్ నగరంతో పాటు దేశవ్యాప్తంగా అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఇదివరకే పలుమార్లు బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా, వారిని బీఎస్ఎఫ్‌కు అప్పగించారు.