-జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు జనరల్ మేనేజర్ అనుపమ
నాగిరెడ్డిపేట్,ఆగష్టు12(ప్రజాజ్యోతి):
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గల రైతులకు ఈ ఖరీఫ్ సీజన్ లో 120 కోట్ల వ్యవసాయ రుణాలు అందించినట్లు జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు జనరల్ మేనేజర్ అనుపమ తెలిపారు. మంగళవారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో మంగళవారం వరకు రైతులకు 120 కోట్ల వ్యవసాయ రుణాలు అందించామని,తద్వారా 80 వేల మంది రుణాలు పొందారని అన్నారు. వ్యవసాయ రుణాలే కాకుండా బంగారు ఆభరణాలపై తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం వలన రైతులు బంగారంపై రుణాలు పొందుతున్నారని, జిల్లాలో కర్షక మిత్ర రుణాలు 30 కోట్ల వరకు చెల్లించామని తద్వారా 1500 మంది రైతులు ప్రయోజనం పొందారని తెలిపారు.కాగా నాగిరెడ్డిపేట్ బ్రాంచ్ లో గత సంవత్సరం 5 కోట్ల 80 లక్షలు బంగారంపై ఇవ్వగా ప్రస్తుతం 7 కోట్లు వరకు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జెనరల్ మేనేజర్ సుమమాల, నాగిరెడ్డిపేట మేనేజర్ ఎల్లేషం ఉన్నారు.