వరంగల్ / ప్రజాజ్యోతి::
రానున్న 72 గంటల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వరంగల్ కమిషనర్ పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలకు సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి పోవాలని.. అలాగే శిదిలావస్థలో ఉన్న భవనాలు, ఇండ్లల్లో నివసించే వారు సైతం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీస్ కమిషనర్ సూచించారు. భారీ వర్షాల కారణంగా పోలీస్ కమిషనర్ ప్రజలకు పలు సూచనలు చేస్తూ అత్యవసరం ఉంటేనే బయటకు రావాలి,వెదర్ అప్డేట్స్ ఫాలో అవుతూ పనులు షెడ్యూల్ చేసుకోవాలని, వర్షంలో వాహనం పై ప్రయాణించే వారు వాహనాల కండీషన్ పరిశీలించుకోవాలని.వాహనదారులు నిదానంగా డ్రైవింగ్ చేయాల్సి వుంటుందని,అలాగేభారీ వర్షాలున్నప్పుడు బయటకు రావొద్దని, ముఖ్యముగా వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద నిలబడటం ప్రమాదకరమని,విద్యుత్ స్థంబాల దగ్గర్లో నిలబడటం, తాకడం చేయద్దని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. ఏదైనా విపత్కర పరిస్థితులు ఏర్పడితే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ ప్రజలను అప్రమత్తం చేశారు.