ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలో నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం అధికంగా వస్తోంది. దీంతో ప్రాజెక్టు యొక్క రెండు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు, నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలకు చేరింది. నాగార్జున సాగర్ జలాశయానికి ఇన్ ఫ్లో 65,827 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 60,644 క్యూసెక్కులుగా నమోదైంది.