నల్లబెల్లి /ప్రజా జ్యోతి:
వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామనికి చెందిన మృతుల కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఎండి సర్వర్ అనారోగ్యంతో మరణించడం జరిగింది. మరణ వార్త తెలుసుకున్న నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదివారం ఎండి సర్వర్ పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించి మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మరణించిన కొత్తగట్టు రవీందర్- తంగెళ్ల రామస్వామిల కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు క్యాతం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నానబోయిన రాజారామ్, పాండవులు రాంబాబు, నాగేల్లి శ్రీనివాస్, సామల దేవేందర్, గుమ్మడి వేణు, వేల్పుల రవి, ఎండి సద్దాం హుస్సేన్, మెడిపెల్లి రాజు గౌడ్. నల్లబెల్లి బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.