ఎమ్మెల్యేను కలిసిన బండా సురేందర్
— జి డబ్ల్యు ఏసి గల్ఫ్ మండల అధ్యక్షుడు
రామారెడ్డి ఆగస్టు 7 (ప్రజా జ్యోతి)
కామారెడ్డి ఎమ్మెల్యే కటిపల్లి వెంకట రమణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జి డబ్ల్యూ ఏ సి, గల్ఫ్ కార్మికుల సంఘం రామారెడ్డి మండల అధ్యక్షుడు బండా సురేందర్ మర్యాదపూర్వకంగా కలిసి స్థానికంగా ఉన్న పలు రకాల సమస్యలపై విన్నవించారు. అదేవిధంగా అసెంబ్లీలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని కోరారు. కొద్దిరోజుల క్రితం గల్ఫ్ దేశం బైరాన్ లో ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా అక్కడ సురేందర్ కలిసి గల్ఫ్ సమస్యలను తీర్చాలని విన్నవించడం జరిగింది. అదేవిధంగా గురువారం ఎమ్మెల్యే నివాసంలో కలిసి సమస్యలపై స్పందించాలని విన్నవించడం జరిగిందని అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి స్థానిక సమస్యలపై అదేవిధంగా గల్ఫ్ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలపడం జరిగిందని అన్నారు.