తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళుతున్నారు. ఈ మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరుతారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నాలో ఆయన పాల్గొంటారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొననున్నారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల ముఖ్యనాయకులు ఢిల్లీకి చేరుకున్నారు.
మరోవైపు, బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నారు