హనుమకొండ / ప్రజాజ్యోతి:
చదువు నాకు అర్ధం అయితలేదు.. చెపితే మీరు అర్ధం చేసుకుంటలేరు.. అంటూ ఓ ఇంటర్ విద్యార్థి తన తల్లిదండ్రులకు లేఖ రాసి కాలేజీ లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. హనుమకొండలోని నయీమ్ నగర్ ఎస్సార్ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్న మిట్టపల్లి శివాని (16) అనుమానస్పదంగా మృతి చెందింది.
శివాణి రాసిన లేఖలో..
చెల్లిని బాగా చదివించండి, మంచి కాలేజిలో మంచి గ్రూప్ తీసుకోమను… నా లాగ అర్ధం కాని చదువు వద్దు దాన్ని మంచిగా చదివించి మీరు మంచిగ ఉండండి… కాళేజిలో జాయిన్ చేసే ముందు ఎవరినైన కొంచం అడిగి జాయిన్ చేయండి, చెల్ల నువ్వు కూడా మంచిగ చదువుకోవే…. ఆ చదువు నాకు అర్ధం ఐతలే మీకు చెప్త మీరు అర్ధం చేస్కుంటలే…. నాకు మొత్తం టెన్షన్ ఐతాంది, మైండ్ పోతాంది.. మీరు చెప్పిన చదువు నాతోని ఐతాలే, నేను చదువుదాం అనుకున్న చదువుకి మీరు ఒప్పుకుంటలే.. చిదరికి నాకు చావే దిక్కు అయింది… ఏం అర్ధం కాకా మద్యలో నలిగి పోతున్న…. ఈ సంవత్సం అంటే ఏదో మీరు ఫీజు కట్టారు. అని ఏదోలా కింద మీద పడి ఉన్న …. · ఇగ నాతోని కాదు.. ఇంత తక్కువ మార్కులు రావడం నేను మరియు మీరు తట్టుకొలేరు అందుకే చనిపోతున్న ఈ ఒక్క సంవత్సరం అందరు జాగ్రత్త… మంచిగ ఉండండి. కూడా మీకోసమే చదివిన అయిన నా లోని అయితలే ఎంత కాల కష్టపడ్డ రావడం లేదు ….. అందరు జాగ్రత్త..
అంటూ శివాణి రాసిన లేఖను కుటుంబ సభ్యులకు అందించారు.
కుటుంబీకులకు ఎలాంటి సమాచారం అందించకుండానే మృతి దేహాన్ని కళాశాల యాజమాన్యం వరంగల్ ఎంజీఎం కు తరలించారు. దీంతో కుటుంబ సభ్యులు యాజమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని ఎంజిఎంకు మార్చురీకి తరలించడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.