మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై అవగాహన
— జిల్లా బిజెపి అధ్యక్షులు నీలం చిన్న రాజులు
— మండల అధ్యక్షుడు నోముల సందీప్
రామారెడ్డి ఆగస్టు 03 (ప్రజా జ్యోతి)
బిజెపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మహాసంపర్క్ అభియాన్ లో భాగంగా ఆదివారం రామారెడ్డి మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో సాధించిన ప్రగతిని, చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీలపై కరపత్రాలు, స్టిక్కర్ ల ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు నోముల సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు గడ్డం ప్రసాద్,బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గంగాధర్ రావు, బీజేపీ యువమోర్చ జిల్లా కార్యదర్శి ఇసాయిపేట నరేష్ , మండల ప్రధానకార్యదర్శులు వడ్ల కృష్ణ, రేకుల బాలరాజు, మాజీ మండల ప్రధానకార్యదర్శి పూర్ణచందర్ , కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి పందుల గోపి , బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు అంజయ్య , సీనియర్ నాయకులు కృష్ణ యాదవ్, ఇసన్నపల్లి గ్రామ యువమోర్చ అధ్యక్షులు కార్తీక్ రెడ్డి, నిఖిల్ గౌడ్, హరీష్, మని, నిశాంత్ గౌడ్, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.