దామెర / ప్రజాజ్యోతి::
పరకాల రూరల్ ( శాయంపేట )సీఐ గా పనిచేస్తున్న పి .రంజిత్ రావు ఇటీవల వరంగల్ లోని మమునూరు పోలీస్ శిక్షణ కేంద్రం వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి 2 వ డ్యూటీ మీట్ లో రెండు పతకాలు సాధించారు. డ్యూటీ మీట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి హార్డ్ లైన్ ట్రోఫీ తో పాటు, వెండి పతకం ను పొందారు. రెండు పతకాలు తెలంగాణ డీజీపీ శ్రీ జితేందర్ , జైళ్ల శాఖ డీజీపీ సౌమ్యా మిశ్రా, ఐజి చంద్ర శేఖర్ రెడ్డి, వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా స్వీకరించారు. ఈ సందర్భంగా డీసీపీ అంకిత్ కుమార్, ఏసిపి సతీష్ బాబు, పలువురు సీఐ లు, ఎస్సై లు, ప్రజలు అభినందించారు.