ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూకు పార్టీలో కీలక పదవి లభించింది. ఆమెను తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు.
తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఖుష్బూ సుందర్ సహా 14 మంది నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఐదుగురు, రాష్ట్ర కార్యదర్శులుగా మరో 14 మందితో కూడిన జాబితాను నాగేంద్రన్ తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు. ఖుష్బూ ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా, ఆమె పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా కూడా కొనసాగుతున్నారు.