విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న చిత్రం కింగ్ డమ్. సితార ఎంటర్టయిన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ చిత్రం రేపు (జులై 31) వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో, కింగ్ డమ్ టీమ్ నేడు ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను కలిసింది.
పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా కింగ్ డమ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే, నిర్మాత నాగవంశీ… ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై పవన్ ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కింగ్ డమ్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.