కాలభైరవ స్వామి సేవలో హైదరాబాద్ నగర మేయర్
— గద్వాల విజయలక్ష్మి
రామారెడ్డి జూలై 29 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండలం ఇసన్నపల్లి-రామారెడ్డి ఇరు గ్రామాలలో కొలువై ఉన్న దక్షిణ కాశీగా పిలవబడుతున్న శ్రీ కాలభైరవ స్వామి ని మంగళవారం హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దంపతులు స్వామివారిని దర్శించుకుని స్వామి వారికి సింధూర పూజలను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన మేయర్ కు అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ఆలయానికి తొలిసారిగా విచ్చేసిన మేయర్ ను, ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా కాలభైరవ స్వామి విశిష్టత కాశీ క్షేత్రం తర్వాత ఇసన్నపల్లి- రామారెడ్డి గ్రామాలలో కొలువై ఉన్న స్వామివారు,కాశీ క్షేత్రం తర్వాత దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక కాలభైరవ స్వామి ఇక్కడ వెలిశారు. అని స్థానికుల సమాచారం ముఖ్యంగా ప్రతి సంవత్సరం కార్తీక బహులాష్టమి రోజు శ్రీ కాలభైరవ స్వామి జయంతిని ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు. ఈ యొక్క ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి కాకుండా ఇతర చుట్టుపక్కల రాష్ట్రాల నుండి భక్తులు భారీ జన సందోహంతో స్వామివారిని దర్శించుకుంటారు అని ఆలయ ఈవో ప్రభు గుప్తా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, ఆలయ జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, సిబ్బంది.నాగరాజు,భారత్, భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తదుపరి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.