మార్గదర్శకాల ప్రకారం ఏడు ఇసుక రిచ్ లకు అనుమతుల మంజూరు
కరీంనగర్ బ్యూరో, జూలై 29, (ప్రజాజ్యోతి)
వినియోగదారుల అవసరాల నిమిత్తం జిల్లాలోని 7 ఇసుక రీచ్ ల నుంచి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇసుక రవాణాకు అనుమతులను మంజూరు. చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
మంగళవారం కలెక్టరేట్ ఛాంబర్ లో డిస్టిక్ లెవెల్ సాండ్ కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారుల అవసరాల నిమిత్తం ఊటూరు-2, ఊటూరు-1, చల్లూర్, మల్లారెడ్డిపల్లి, కోర్కల్, కొండపాక పోతిరెడ్డిపల్లి రీచ్ లను కేటాయించినట్లు పేర్కొన్నారు.చేగుర్తి ఇసుక రీచ్ ను ప్రభుత్వ అవసరాలు, ఇందిరమ్మ నిర్మాణానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల, పెగడపల్లి మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ అవసరాలకు రామడుగు మండలం మోతెలోని ఇసుక రీచ్ నుండి 15000 మెట్రిక్ టన్నుల ఇసుక తీసుకునేందుకు అనుమతించారు.ఈ సమావేశం లో ఆర్టీవో మహేశ్వర్, మైనింగ్ శాఖ ఏడి రాఘవ రెడ్డి, ఈఈ లు బలరామయ్య, రవీంద్ర కిషన్, జిల్లా ఇరిగేషన్ అధికారి జగన్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, జియాలాజిస్ట్ ప్రసన్న కరణం, ఇతర అధికారులు పాల్గొన్నారు.