కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం కూలీ ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేశారు. ఇటీవల దర్శకుడు లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదల కార్యక్రమం ఏమీ ఉండదని, నేరుగా సినిమాను విడుదల చేస్తామని అన్నారు.
కానీ ఆకస్మాత్తుగా కూలీ ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఆగస్టు 2వ తేదీన ట్రైలర్ లాంచింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎల్ సీయూ వరల్డ్‌లో వస్తున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే అంచనాలను పెంచేసింది. రజినీకాంత్ లుక్స్, పోస్టర్లు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.