సూర్యాపేట జిల్లా ప్రతినిధి జూలై 27(ప్రజాజ్యోతి):కాలుష్య రహిత ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ రోడ్డులో ఎల్ఐసి ఆఫీసు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన జెఎస్ఆర్ గ్రీన్ మోటార్స్ ఎలక్ట్రికల్ బైక్ షోరూంను ఆయన ప్రారంభించి మాట్లాడారు.కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.దీనిలో భాగంగా ఎలక్ట్రికల్ వాహనాల వాడకాన్ని పెంచాలన్నారు. ఎలక్ట్రికల్ వాహనాల వల్ల ఖర్చు,ఇంధన ఆదాతో పాటు కాలుష్య నివారణకు కృషి చేసినట్లు అవుతుందన్నారు. అనంతరం జెఎస్ఆర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఫౌండర్ అండ్ సీఈవో పాశం జనార్ధన రెడ్డి మాట్లాడుతూ తమ వద్ద ఎనిమిది రకాల కంపెనీలకు చెందిన 40 మోడల్స్ ఎలక్ట్రికల్ బైకులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.కేంద్ర ప్రభుత్వ సబ్సిడీని పొందే ఎలక్ట్రికల్ బైక్ లు కూడా అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.ప్రముఖ కంపెనీలైన రివోల్ట్, బ్యాటరీ మొబిలిటీ, కైనటిక్ గ్రీన్, డైనమో,గో ఇన్, ఐ ఓమీ, ఒకయా వంటి బ్రాండెడ్ ఎలక్ట్రికల్ బైకులు తమ వద్ద లభిస్తాయని తెలిపారు.ఎలక్ట్రికల్ బైక్ ల వల్ల తక్కువ విద్యుత్ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించడంతో పాటు పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను ఆదా చేయవచ్చన్నారు.కాలుష్య నివారణలో ఎలక్ట్రికల్ వాహనాల ప్రాముఖ్యత ఎంతో ఉందన్నారు.రానున్న రోజుల్లో ఎలక్ట్రికల్ వాహనాలకే ఆదరణతో పాటు డిమాండ్ ఉందన్నారు.సూర్యాపేటలో తమ యొక్క ఐదవ బ్రాంచ్ ప్రారంభించామని తెలిపారు.గ్యారెంటీ,వారంటీతో తాము అందించే ఎలక్ట్రికల్ బైకులను సూర్యాపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.నూతన షోరూం ప్రారంభం సందర్భంగా మొదటి ఐదు రోజులలో రూ.39999కే ఎలక్ట్రికల్ బైక్ అందించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోదాడ బ్రాంచ్ జనరల్ మేనేజర్ బి.శ్రీనివాస్,నేరేడుచర్ల షోరూం ప్రోప్రైటర్ జూలకంటి జానారెడ్డి,సూపర్వైజర్ సాయికుమార్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.