లంబాడి హక్కుల పోరాట సమితి

Kamareddy
4 Min Read

లంబాడి హక్కుల పోరాట సమితి

– డా, బెల్లయ్య నాయక్

గాంధారి జులై 27(ప్రజాజ్యోతి)

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, గిరిజన భూములకు ఎలాంటి ఆటంకం కలిగించినా సహించేది లేదని లంబాడీ హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు, ట్రైకార్ చైర్మన్ డాక్టర్ తేజావత్ బేల్లయ్య నాయక్ అన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని మారుతి ఫంక్షన్ హాల్‌లో లంబాడీ హక్కుల పోరాట సమితి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షులు మూడవత్ రాంబల్ నాయక్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.లంబాడీ హక్కుల పోరాట సమితి ఆవిర్భావం, పోరాటాలు.డాక్టర్ బేల్లయ్య నాయక్ మాట్లాడుతూ లంబాడీ హక్కుల పోరాట సమితి 1997 జూలై 1న ‘మా తండాలో మా రాజ్యం’ అనే లక్ష్యంతో ఆవిర్భవించిందని తెలిపారు.గ్రామాలకు దూరంగా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ‘మేమెంత మందిమో మాకంతా వాటా కావాలి’ అనే నినాదంతో పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. లంబాడీ హక్కుల పోరాట సమితి పోరాట ఫలితంగా గత కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 3,000లకు పైగా నూతన గిరిజన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి ‘మా తండాలో మా రాజ్యం’ లక్ష్యాన్ని సాధించిందని పేర్కొన్నారు.అదేవిధంగా, జనాభా దామాషా ప్రకారం గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని, 6 శాతంగా ఉన్న గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచేలా గత ప్రభుత్వంలో సాధించుకున్నామని, ఇది లంబాడీ హక్కుల పోరాట సమితి విజయమని అన్నారు. లంబాడీల భాష గోర్ బోలిని భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చడం కోసం లంబాడీ హక్కుల పోరాట సమితి పోరాటంతో ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపే విధంగా చేసుకుందని వెల్లడించారు.లంబాడీ హక్కుల పోరాట సమితి నిరంతరం లంబాడీ జాతి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడంలో ముందు వరుసలో ఉంటుందని, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళల పక్షాన లంబాడీ జాతికి ఏ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లాలో ఫారెస్ట్ భూములకు, రైతులు సాగు చేస్తున్న భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలి.లంబాడీ భాష గోర్ బోలిని భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలి. తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలి. రాష్ట్ర బడ్జెట్‌లో బంజారాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. లంబాడీ జాతి అభివృద్ధికి తండా డెవలప్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్‌లో గిరిజనులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి. గిరిజన నిరుద్యోగ యువతి, యువకులకు ఉపాధి నిమిత్తం గత ప్రభుత్వం మంజూరు చేసి సబ్సిడీ రుణాలను విడుదల చేయాలి. రాజీవ్ యువ వికాసం పేరుతో గిరిజన కార్పొరేషన్లను నిర్వీర్యం చేసే కుట్రను విరమించుకొని, గిరిజన కార్పొరేషన్ల ద్వారానే ఉపాధి అవకాశాలు కల్పించాలి. రాష్ట్రంలో ప్రత్యేక (గిరిజన) కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన లంబాడీ సామాజిక వర్గానికి రాష్ట్ర క్యాబినెట్‌లో స్థానం కల్పించాలి.గిరిజనులకు జిల్లాను యూనిట్‌గా తీసుకొని అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలి.తీజ్ పండుగను జాతీయ పండుగగా గుర్తించాలి.తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న గిరిజన విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయలి. మైదాన ప్రాంతంలో ఐదు ఐటిడిఎలను, బంజారా సేవాలాల్ మహారాజ్, ఆదివాసి కొమరం భీం కార్పొరేషన్, ఎరుకల నాంచారమ్మ కార్పొరేషన్‌లను ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ అవసరం వచ్చినా లంబాడీల భూములు గుర్తుకొస్తున్నాయని, పరిశ్రమలు, ఫార్మా పరిశ్రమలు, ప్రాజెక్టులు, రోడ్ల పేరుతో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న లంబాడీ భూములను గుంజుకుంటున్నారని, తక్షణమే లంబాడీల భూముల జోలికి రావద్దని డిమాండ్ చేశారు. లంబాడీలపై, లంబాడీ మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.

ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి కోటి అన్నయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ నాయక్, రాణా ప్రతాప్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వినోద్ నాయక్ రాష్ట్ర కార్యదర్శి, నునావత్ గణేష్ నాయక్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, కాట్రావత్ బద్రు నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి, మోతిలాల్ నాయక్ గాంధారి మండలం అధ్యక్షులు, పరశురామ్ ప్రధాన కార్యదర్శి, అనిల్, ప్రేమ్ సింగ్, సాకారం, దేవిసింగ్, గబ్బర్ సింగ్ లంబాడీ యువజన విభాగం అధ్యక్షులు, మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *