వరంగల్ సిటీ, జూలై26(ప్రజాజ్యోతి):
వరంగల్ నగరంలోని బీరన్న కుంటకు చెందిన రాజు (35) అనే వ్యక్తి చెరువులో ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లు సేకరిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు అదుపు తప్పి చెరువులో పడి మృతి చెందాడు. వివరాలలోకెళితే శనివారం నగరంలోని ఉర్సు గుట్ట వద్ద గల చెరువులో ఉన్న ప్లాస్టిక్ బాటిళ్ల, వస్తువులు ఏరుకోవడానికి బీరన్న కుంటకు చెందిన రాజు చెరువులో దిగగా ఒక్కసారిగా మునిగిపోయాడు. చెరువు లోపల గల చెత్త చెదారం మూలంగా అతను కదలలేక నీళ్లలోనే మునిపోయాడు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించగా స్పందించిన మిల్స్ కాలనీ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనతో రాజు కుటుంబం విషాదంలో మునిగిపోయింది.