చేర్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని ఆది ఆంజనేయస్వామి దేవాలయమునకు వెళ్లే దారి మొత్తం గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి రహదారి అంత బురదమయం కావడంతో ప్రతి శనివారం వచ్చే భక్తులు రహదారి వెంట వెళ్ళాలంటే బయపడి వెనుదిరిగి పోతున్నారు అని ఒక భక్తుడు సోషల్ మీడియా ద్వారా తన బాధను తెలియజేశారు.ఇప్పటికైనా ఆంజనేయస్వామి అధికారుల మనసులోకి వచ్చి అయిన రహదారి బాగుచేయాలని చెపితే బాగుండు అని భక్తుడు వీడియో ద్వారా తెలియజేశారు.ఇప్పటికైనా అధికారులు ఆ దారి లో వెళ్ళే విధంగా మరమత్తులు చేయాలని భక్తులు కోరుకుంటున్నారు.