మీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడుతూ, బిసి రిజర్వేషన్లు 42 శాతం అమలు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి ఎనలేనిదని, గతంలో.ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనుగడ ఉండదని తెలిసి కూడా ముందడుగు వేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అన్నారు అదేవిధంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా నిలబెట్టుకుంటుంది. ఇచ్చిన మాట కట్టుబడి ఉండి .200 యూనిట్ ఫ్రీ కరెంటు కానివ్వండి. మహిళలకు ఉచిత బస్సు మరియు సన్న బియ్యం. పథకం పలు మంచి మంచి పథకాలు చేపడుతుంటే. కాంగ్రెస్ పార్టీపై బి ఆర్ ఎస్ నాయకులు కేటీఆర్,హరీష్ రావు అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ నాయకులు బొమ్మల యాదగిరి, రాష్ట్ర మైనార్టీ నాయకులు కలీం ఉద్దీన్, డిసిసి ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ షాబుద్దీన్, ఒకటో వార్డు ఇంచార్జ్ మెరుగు రాజు పాల్గొన్నారు.