ఈ నెల 27వ తేదీన సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే హాఫ్ మారథాన్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం నిర్వహించనున్న హాఫ్ మారథాన్ టీ షర్ట్ లను సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు, జిల్లా జర్నలిస్ట్ సంఘం అధ్యక్షుడు రంగాచారితో కలిసి ఏసీపీ రవీందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసీపీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో తాను కూడా రన్నింగ్, కబడ్డీ పోటీల్లో పాల్గొని ఛాంపియన్ గా నిలిచానన్నారు. సిద్దిపేటలో హాఫ్ మారథాన్ నిర్వహించడం గొప్ప విషయమని.. ప్రతిరోజు రన్నింగ్, వాకింగ్ చేయడం అనేది చాలా అవసరం అన్నారు. శారీరకంగా, మానసికంగా బలంగా లేకపోవడం వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి రన్నింగ్ రేసులు సమాజానికి ఎంత ఉపయోగపడతాయన్నారుశారీరక వ్యాయమం చేయకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయని ఏసీపీ తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షుడు రంగాచారి మాట్లాడుతూ తమ సంపూర్ణ సహకారం ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఈ హాఫ్ మారథాన్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ.. ఆరోగ్య సిద్దిపేట గా మార్చాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం హాఫ్ మారథాన్ నిర్వహిస్తున్నామని, యువకులు డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా బెట్టింగ్ యాప్ లకు దూరంగా ఉండే విధంగా అనేక అవగాహన రన్నింగ్ కార్యక్రమాలు నిర్వహించమని అన్నారు మా పోరాటం డ్రగ్స్ బెట్టింగ్ యాప్స్ పైన నిరంతరం ఉంటుందని తెలిపారు యువకులు ఏదో ఒక వ్యాయామం వ్యాపకంగా గా అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ రన్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ కౌన్సిలర్ బ్రహ్మం, సీనియర్ జర్నలిస్ట్ లు సంజీవరెడ్డి, పాండు, బబ్బూరి రాజు, రంగధాంపల్లి శ్రీను, రమణారావు, ఎన్.రాజు, రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు నిమ్మ కృష్ణారెడ్డి,రమేష్, అశోక్, రాజిరెడ్డి హరికృష్ణ, గోపాల్ శ్రావణ్ లింగారెడ్డి వీరన్న పాల్గొన్నారు.