చిరుత పులి ఆచూకీ పై ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం..?
— చిరుత పులితో భయాందోళన
— భయాంతో గ్రామస్తులు తండవాసులు
— మత్తు నిద్రలో ఫారెస్ట్ అధికారులు..?
కామారెడ్డి ప్రతినిధి జూలై 24 (ప్రజా జ్యోతి)
కామారెడ్డి జిల్లా కేంద్రంలో లంబాడా హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్ మాట్లాడుతూ కామారెడ్డి డివిజన్లలో చిరుత పులిని పట్టుకోవడంలో ఫారెస్ట్ అధికారులు వైఫల్యం..? చిరుత పులి బెడద రామారెడ్డి రెడ్డిపేట్ గూగుల్ తండా మాచారెడ్డి మండల ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తు గిరిజనుల మూడు
ఆవులను చంపేసి తినేసింది చిరుత పులితో ప్రజలను భయాం దోళనలకు గురిచేస్తుంది. ఆవులు గేదెలు మేకలు గొర్రెలను అడవుల్లో మేపడానికి వెళ్లడానికి ప్రజలు వణకి పోతున్నారు.చిరుత పులి తిన్న ఆవుల యజమానుకు నష్టపరిహారాన్ని ఎవరు భరిస్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మత్తు నిద్రలో ఉందా..? చిరుత పులిని ఎందుకు పట్టడం లేదు..?
ప్రభుత్వం ఫారెస్టు డిపార్ట్మెంట్ పై ఎందుకు చర్య తీసుకోవడం లేదు ఫారెస్ట్ అధికారుల పై ఎందుకు చర్యలు తీసుకోడం లేదు..? అని లంబాడ కుల పోరాట సమితి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది.
రామారెడ్డి మండలంలో రెడ్డిపేట తండాలో నలుగురిని చిరుత పులి పై హాని చేస్తున్నారు.అనే అనుమానంతో అరెస్ట్ చేయడం జరిగింది. వారిని వెంటనే రిలీజ్ చేయాలని లంబాడా హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది.గిరిజనులు పోడు భూములు సాగు చేస్తా ఉంటే ఫారెస్ట్ అధికారులు అక్రమ కేసులు బనాయిస్తూ గిరిజనులను వేదిస్తావున్నారు. అక్రమ అరెస్టు చేస్తున్నారు.అక్రమ అరెస్టు ఆపాలని లంబాడా హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథోడ్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ నాయక్,జిల్లా ప్రధాన కార్యదర్శి బద్రి నాయక్, గౌరవ అధ్యక్షులు రూప్సింగ్ నాయక్,రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవిందర్ నాయక్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ నాయక్,జిల్లా ఉపాధ్యక్షుడు దేవి సింగ్ నాయక్, మండల అధ్యక్షులు షేర్ సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.