వరంగల్ / ప్రజాజ్యోతి
భూపాలపల్లి ఎమ్మెల్యే వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ జర్నలిస్తులు జిల్లా కేంద్రంలో ధర్నా చేశారు. భూపాలపల్లి లో నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు ర్యాలీ ధర్నా చేశారు. కాకతీయ ప్రెస్ క్లబ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. అంబేద్కర్ సెంటర్ లో ప్లకార్డ్ తో ధర్నా నిర్వహించి జర్నలిస్టులు నిరసన తెలిపారు. మంత్రుల పర్యటన ప్రోగ్రామ్ ను బహిష్కరించి జర్నలిస్టులు నిరసన తెలిపారు. జర్నలిస్టుల పై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.