ఆత్మకూరు / ప్రజాజ్యోతి::
గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం లేకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని మల్కపేట గ్రామానికి చెందిన యువకుడు బుస్స శివ, కుల సంఘాల అధ్యక్షులు అన్నారు. ఆదివారం మల్కపేట గ్రామంలో వారు మాట్లాడుతూ.. మల్కపేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 20 మంది విద్యార్థులు ఉండగా ఏడుగురు ఉపాధ్యాయులు ఉండేవారని వర్క్ అడ్జెస్ట్మెట్ అని నలుగురు ఉపాధ్యాయులను బదిలీ చేశారని దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఇంకా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, గ్రామంలో అందరితో మాట్లాడి విద్యార్థులను ప్రవేట్ స్కూల్ లోకి పంపకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివించేలా కృషి చేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి ఉపాధ్యాయుల బదిలీలు రద్దుచేసి సొంత స్థానాలకు రప్పించాలని డిమాండ్ చేశారు..